BREAKING
thumb ● వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి thumb ● అంకంపాలెం, వెలిచెరులో స్వచ్ఛత–సేవా సంకల్ప కార్యక్రమాలు thumb ● వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి thumb ● అంకంపాలెం, వెలిచెరులో స్వచ్ఛత–సేవా సంకల్ప కార్యక్రమాలు thumb ● వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ
Date of Publish : 19 August 2026, 04:06 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు నూతన సబ్‌ రిజిస్ట్రార్‌గా ఎస్‌ఎన్‌వీ సత్యనారాయణ బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 04:06 PM
78 వీక్షణలు

పారదర్శక పాలనకు ప్రాధాన్యత.. అక్రమాలకు తావు ఉండదని స్పష్టం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండల కేంద్రంలోని సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో నూతన సబ్‌ రిజిస్ట్రార్‌గా ఎస్‌ఎన్‌వీ సత్యనారాయణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

విజయవాడ నుంచి బదిలీపై వచ్చిన ఆయన సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రజలకు అందించే అన్ని ప్రభుత్వ సేవలు ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్ సేవల్లో నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు తిరువూరు సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేసిన చాముండేశ్వరి దేవి బదిలీ కావడంతో భూముల క్రయ, విక్రయదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

గత కొంతకాలంగా అక్రమ రిజిస్ట్రేషన్లు, అవినీతి ఆరోపణలు, వరుస వివాదాల నేపథ్యంలో చాముండేశ్వరి దేవి బదిలీ ఉత్తర్వులు వెలువడటంతో కొత్త అధికారిపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. పారదర్శకంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగాలని స్థానికులు కోరుతున్నారు.