BREAKING
thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు thumb ● చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు thumb ● చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Date of Publish : 24 August 2026, 08:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో ఆహార విక్రయ కేంద్రాలపై మున్సిపల్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 08:47 PM
59 వీక్షణలు

తిరువూరులో ఆహార విక్రయ కేంద్రాలపై మున్సిపల్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

పరిశుభ్రత పాటించకుంటే చర్యలు తప్పవని హోటళ్లు, ఫుడ్‌ స్టాల్స్‌ యజమానులకు హెచ్చరిక

తిరువూరు: తిరువూరు పురపాలక సంఘ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్‌ స్టాల్స్‌పై మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ కె. మనోజ పట్టణంలోని పలు ఆహార విక్రయ కేంద్రాలను పరిశీలించి అక్కడి పరిశుభ్రతా పరిస్థితులను తనిఖీ చేశారు.

ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాల్లో తప్పనిసరిగా పరిశుభ్రతా ప్రమాణాలు పాటించాలని నిర్వాహకులకు సూచించారు. ఆహార పదార్థాలను బహిరంగంగా ఉంచకుండా కప్పి భద్రపరచాలని, వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా మున్సిపల్ నిబంధనల ప్రకారం సక్రమంగా పారవేయాలని ఆదేశించారు.

ప్రజారోగ్యానికి హాని కలిగించే విధంగా నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్‌ స్టాల్స్‌పై మున్సిపల్ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ కె. మనోజ హెచ్చరించారు. పట్టణ ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందేలా నిరంతర తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు.