BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 30 July 2026, 06:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో అంగన్వాడీ కార్యకర్తలకు రెండు జతల చీరల పంపిణీ చేసిన శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాస రావు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jul, 2026 - 06:43 PM
68 వీక్షణలు

తిరువూరు, జూలై 30: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు ప్రభుత్వం అందజేస్తున్న రెండు జతల చీరలను గురువారం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన కార్యాలయంలో పంపిణీ చేశారు.

నియోజకవర్గంలోని 272 అంగన్వాడీ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు ప్రభుత్వం అందిస్తున్న చీరలను ఎమ్మెల్యే స్వయంగా అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అంగన్వాడీ సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అలాగే 'తల్లికి వందనం' పథకం అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.