BREAKING
thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్ thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్
Test 4
Date of Publish : 18 November 2026, 09:35 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Nov, 2026 - 09:35 PM
17 వీక్షణలు

 దళారుల ప్రమేయం లేకుండా రైతులకు కనీస మద్దతు ధర.. రైతుల కల్లాల వద్దకే వెళ్లి ధాన్యం నాణ్యత పరిశీలన సాధారణ రకానికి క్వింటాల్‌ రూ.2,441.. గ్రేడ్‌-ఎ రకానికి రూ.2,461 మద్దతు ధర ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకతకు పెద్దపీట.. నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ తిరువూరు, నవంబర్ 18: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటిస్తూ రైతులకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర అందేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. దళారులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులు తమ గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల ద్వారానే ధాన్యాన్ని విక్రయించుకోవచ్చని సూచించారు. తిరువూరు మండలంలోని లక్ష్మీపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్), కాకర్ల రైతు సేవా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొనుగోళ్లకు చేసిన ఏర్పాట్లు, సిబ్బంది విధులు, రైతులకు కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించి, ధాన్యం సేకరణలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం రైతులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ ఇటీవల ఆర్నబ్, మురసు తుఫాన్ల ప్రభావం, పంట నష్టం, ప్రస్తుత దిగుబడి, ధాన్యం ధరలు, ప్రభుత్వం అందిస్తున్న కనీస మద్దతు ధరపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి సాగు విస్తీర్ణాన్ని కొంత తగ్గించామని, తుఫాన్ల కారణంగా తమ పంటలకు ఎలాంటి నష్టం జరగలేదని, ప్రస్తుతం ధాన్యానికి గిట్టుబాటు ధర లభిస్తోందని రైతులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ 2026-27 సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లను రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు. సాధారణ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,441, 75 కిలోల బస్తాకు రూ.1,831 చెల్లిస్తుండగా, గ్రేడ్-ఎ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,461, 75 కిలోల బస్తాకు రూ.1,846 కనీస మద్దతు ధరగా అందిస్తున్నట్లు వివరించారు. రైతుల కల్లాల వద్దకే రైతు సేవా కేంద్రాల సిబ్బంది వెళ్లి ధాన్యం నాణ్యతను పరిశీలిస్తారని, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని రైతుల సమక్షంలోనే కొనుగోలు చేస్తారని స్పష్టం చేశారు. రైతులు ముందుగా రైతు సేవా కేంద్రంలో లేదా 7337359375 నంబర్‌కు వాట్సాప్ సందేశం పంపడం ద్వారా ధాన్యం విక్రయానికి షెడ్యూల్ చేసుకోవచ్చని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన నగదును రైతుల ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని తెలిపారు. రైతులు స్వయంగా గోనె సంచులు, హమాలీలు, రవాణా ఏర్పాట్లు చేసుకున్నట్లయితే నిబంధనల ప్రకారం వాటికి సంబంధించిన మొత్తాన్ని కూడా వారి ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొన్నారు. ధాన్యం రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ పరికరాలు తప్పనిసరిగా అమర్చాలని ఆదేశించినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లుల వరకు ధాన్యం రవాణాను నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎదురయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు జిల్లా స్థాయితో పాటు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ప్రధాన కార్యాలయంలోనూ ప్రత్యేక నియంత్రణ గదులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. రైతులు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే జిల్లా పౌరసరఫరాల మేనేజర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 7702003571 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ధాన్యం కొనుగోలు విధానాన్ని సద్వినియోగం చేసుకొని దళారులకు అవకాశం ఇవ్వకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని విక్రయించి కనీస మద్దతు ధర పొందాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తిరువూరు ఆర్డీవో ఎ.కుమార్, తహసీల్దార్ చంద్రమౌళి, పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.