BREAKING
సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం.
www.ntodaynews.com

తిరువూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ఆర్డీఓ ఎ. కుమార్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Aug, 2026 - 11:43 AM
6 వీక్షణలు

తిరువూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ఆర్డీఓ ఎ. కుమార్ పాల్గొన్నారు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో శనివారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎ. కుమార్ పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.

ఈ సందర్భంగా ఆర్డీఓ ఎ. కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం ద్వారా ప్రతి అర్హుడికి పింఛను సకాలంలో, పారదర్శకంగా అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. అర్హులైన ఒక్క లబ్ధిదారుడు కూడా పింఛనుకు దూరం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ సేవలు సులభంగా అందేలా అధికారులు నిరంతరం కృషి చేయాలని తెలిపారు.

లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని, పింఛన్ల పంపిణీ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో తిరువూరు తహసీల్దార్, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, రెవెన్యూ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.