BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 26 July 2026, 02:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తల్లికి వందనం పథకానికి మరో అవకాశం.. ఆగస్టు 3 వరకు ఫిర్యాదులు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jul, 2026 - 02:38 PM
80 వీక్షణలు

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకంలో అర్హులైనా ఆర్థిక సాయం అందని విద్యార్థుల తల్లిదండ్రులకు మరో అవకాశం కల్పించింది. అర్హులు, అనర్హుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు.

ఆగస్టు 3 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరించనుండగా, ఆగస్టు 4 నుంచి 10 వరకు వాటిని పరిశీలించి అదనపు అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేయనున్నారు. మొదటి విడతలో సాయం అందని వారు లేదా అర్హత ఉన్నప్పటికీ జాబితాలో పేరు లేనివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

కొత్తగా అర్హులుగా గుర్తించిన విద్యార్థులతో పాటు, ఒకటో తరగతి మరియు జూనియర్ ఇంటర్‌లో తాజాగా చేరిన విద్యార్థుల జాబితాలను ఆగస్టు 30న విడుదల చేయనున్నారు. అదే రోజు అర్హులైన లబ్ధిదారుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఒకటో తరగతి, జూనియర్ ఇంటర్‌లో కొత్తగా చేరే విద్యార్థుల ప్రవేశాలకు ఆగస్టు 25 వరకు గడువు నిర్ణయించారు. ఆలోపు ప్రవేశాలు పూర్తి చేసుకున్న వారు అవసరమైన పత్రాలతో సంబంధిత గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు.