BREAKING
thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ
Date of Publish : 16 August 2026, 08:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తుమ్మగూడెం గ్రామం అభివృద్ధిలో మరో ముందడుగు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Aug, 2026 - 08:04 PM
105 వీక్షణలు


ప్రధాన సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం తుమ్మగూడెం గ్రామంలో ప్రజల చిరకాల అవసరమైన ప్రధాన సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గ్రామ ప్రజల రాకపోకలకు ఎంతో ఉపయోగపడే ఈ రహదారి నిర్మాణంతో మౌలిక వసతులు మరింత మెరుగుపడనున్నాయి.

గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రధాన రహదారి నిర్మాణానికి సహకరించిన నూజివీడు ఎమ్మెల్యే, గృహ నిర్మాణ శాఖ మంత్రి, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

రోడ్డు మంజూరు నుంచి నిర్మాణ పనుల ప్రారంభం వరకు నిరంతరం కృషి చేసి, గ్రామ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తుమ్మగూడెం గ్రామ టీడీపీ అధ్యక్షుడు మందలపు రాజారావును గ్రామ ప్రజలు అభినందించారు.

మంత్రి కొలుసు పార్థసారథి చొరవ, మందలపు రాజారావు కృషితో తుమ్మగూడెం గ్రామానికి ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రధాన రహదారి కల సాకారమవుతోందని గ్రామస్థులు పేర్కొన్నారు.

గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించాలని గ్రామ ప్రజలు ఆకాంక్షించారు.