BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 30 July 2026, 02:37 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తునికిపాడు ప్రాథమిక పాఠశాలలో ఘనంగా తిక్కన్న జయంతి, గురుపౌర్ణమి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jul, 2026 - 02:37 PM
107 వీక్షణలు

గంపలగూడెం, జూలై 30: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామ ప్రాథమిక పాఠశాలలో గురువారం కవిబ్రహ్మ తిక్కన్న జయంతి, గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా తిక్కన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు సాహిత్యంలో కవిత్రయంలో రెండో కవిగా పేరొందిన తిక్కన్న, సంస్కృత వ్యాసభారతాన్ని తెలుగులో అనువదించే క్రమంలో నన్నయ్య పూర్తి చేయలేకపోయిన రచనను కొనసాగిస్తూ, అరణ్య పర్వంలోని శేష భాగాన్ని మినహాయించి మిగిలిన 15 పర్వాలను తెలుగులో రచించి తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించారని వక్తలు వివరించారు.

అనంతరం పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులకు శిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు పరీక్షల ప్యాడ్లను పంపిణీ చేశారు.

గురుపౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులు సంగెపు వెంకటేశ్వర్లు, ఆదూరి వెంకట నరసింహారావు, బోడేపూడి సమత, పిల్లి రవికుమార్, యలగందుల శ్రీనివాసరావులను శిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి, సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు ఊటుకూరు నారాయణరావు, పారేపల్లి వెంకట కృష్ణారావు, ఊటుకూరు యజ్ఞ కృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.