BREAKING
thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన
Date of Publish : 11 July 2025, 07:28 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయాలి

తెలంగాణ
11 Jul, 2025 - 07:28 PM
321 వీక్షణలు
జూలై 22,23 తేదీలలో గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం (GMPS) జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయాలి--జిఎంపిఎస్ అధ్యక్ష కార్యదర్శులు దయ్యాల నరసింహ, మద్దెపురం రాజు NTODAY NEWS: బొమ్మల రామారం జూలై 22,23 తేదీలలో రాయిగిరి లింగ బసవ గార్డెన్లో జరిగే గొర్రెలు,మేకల పెంపకందారుల సంఘం GMPS యాదాద్రి భువనగిరి జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయాలని సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దయ్యాల నర్సింహ్మ, మద్దెపురం రాజు కోరారు. శుక్రవారం రోజున బొమ్మలరామారం GMPS మండల కమిటీ అధ్యక్షులు బుడుమ శ్రీశైలం ఆధ్వర్యంలో మహాసభల కరపత్రం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన వారు మాట్లాడుతూ ఈ మహాసభలకు గొల్ల, కురుమలు గొంగళ్ళు, డోలు, తాళం, గజ్జలు ధరించి అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. గొల్ల, కురుమలు,గొర్రెల మేకల పెంపకందారులు తమ సమస్యల పరిష్కారానికై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. గొర్లు మేకలకు మేత,నీరు, వైద్యం,గొర్రెలకు భీమా,గొర్ల కాపరులకు 50సం.లకు పింఛన్లు, సబ్సిడీ రుణాలు, ఎక్స్గ్రేషియో, చదువుకున్న యువతీ, యువకులు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గొల్ల కుర్మల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న ఏకైక సంఘం గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం జిఎంపిఎస్ అని అన్నారు. రెండో విడత గొర్ల పంపిణీ నగదు బదిలీ ద్వారా అమలు చేస్తామని కామారెడ్డి బిసి డిక్లరేషన్ కాంగ్రెస్ మేనిఫెస్టో 15,16 పేజిలలో రెండు లక్షల నగదు బదిలీ అధికారంలోకి వచ్చిన మూడు నెలలలో చేస్తామని హామీ ఇచ్చిన హామీని అధికారం చేపట్టి 18నెలలు అయినా అమలు చేయలేదని విమర్శించారు. రోగాలతో గొర్లు మేకలు చనిపోతున్నాయని ప్రభుత్వం నుండి ఎలాంటి మందులు అందడం లేదని అన్నారు. సంవత్సరానికి మూడుసార్లు నట్టల మందు వేస్తామని చెప్పి రెండు సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు నట్టల మందులు వేయలేదని అన్నారు. వెంటనే ప్రభుత్వం మందులు ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూలై 22,23 తేదీలలో రాయగిరిలో జరుగు జిల్లా మహాసభలకు, సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు, గొల్ల కురుమలు భారీ సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల ఉపాధ్యక్షులు మోటె రమేష్, సహాయ కార్యదర్శి గుజ్జ క్రిష్ణ, రాసాల మల్లేష్, బైరబోయిన రాజు, బుడమ మల్లేష్, మోటె మైసయ్య, మ్యాకల రాజు, డోకూరి క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube