BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 26 January 2026, 07:55 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

మండల పరిషత్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

తెలంగాణ
26 Jan, 2026 - 07:55 PM
449 వీక్షణలు
పుంగనూరు మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు NTODAY NEWS: పుంగనూరు ప్రతినిధి: రాఘవేంద్ర రాజు పుంగనూరు టౌన్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షుడు అక్కిసాని భాస్కర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మువ్వన్నెల జాతీయ పతాకం దేశ స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు మరియు రాజ్యాంగ విలువలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మాణానికి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, దేశాభివృద్ధిలో బాధ్యతాయుత భాగస్వాములుగా మారాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ క్రియాశీలక కార్యదర్శి రామకృష్ణ రెడ్డి (కిట్టు), వైఎస్సార్‌సీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. #RepublicDay #77thRepublicDay #IndianConstitution #NationalFlag #MahatmaGandhi #ViksitBharat #DemocracyInIndia #ConstitutionalValues #PublicLeadership #LocalGovernance #Punganur #AndhraPradesh Follow us on Website Facebook Instagram YouTube