BREAKING
thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన
Date of Publish : 15 September 2025, 07:18 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

నిందితునికి 21 ఏళ్ళ కారాగార శిక్ష

తెలంగాణ
15 Sep, 2025 - 07:18 PM
394 వీక్షణలు
ఫోక్సొ కేసులో సంచలన తీర్పునిచ్చిన నల్గొండ ఫోక్సో ఇన్చార్జి న్యాయస్థానం NTODAY NEWS: చిట్యాల నిందితునికి 21 ఏళ్ళ కారాగార శిక్ష 30000 జరిమానా, 10 లక్షలు నష్టపరిహారం: నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో 8 ఏళ్ల క్రితం మూడో తరగతి చదువుతున్న 8 ఏళ్ల మైనర్ బాలికపై బలవంతంగా ఒక వ్యక్తి అత్యాచారం చేసిన సంఘటనపై ఎనిమిదేళ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం నల్గొండ ఫోక్సో ఇన్చార్జి న్యాయస్థానం నిందితునికి 21 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువడించింది. వివరాల్లోకి వెళితే తేదీ ఫిబ్రవరి 1, 2018 న నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, వనిపాకల గ్రామానికి చెందిన మూడవ తరగతి చదివే మైనర్ బాలిక (8) ఇంట్లో టీవీ చూస్తుండగా అదే గ్రామానికి చెందిన దోమల రాములు తాగిన మైకంలో అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి మైనర్ బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఫిబ్రవరి 11, 2018 న స్థానిక చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. స్థానిక పోలీసులు ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఎనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం సోమవారం ఫోక్సో న్యాయస్థానం ఇన్చార్జి న్యాయమూర్తి రోజా రమణి నిందితునికి 21 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా 30,000 రూపాయలు జరిమానా విధించడంతో పాటు బాదితురాలికి 10 లక్షలు నష్టపరిహారం కింద ప్రకటించింది. Follow us on Website Facebook Instagram YouTube