BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 04:36 pm
Posted by : PAGADALA DEVAIAH

ఆదివాసీల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోంది

తెలంగాణ
/ నల్గొండ
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
17 Nov, 2026 - 04:36 PM
33 వీక్షణలు

1/70, పీసా చట్టాల అమలును నిర్లక్ష్యం చేస్తూ అటవీ భూములను కార్పొరేట్లకు అప్పగించే ప్రయత్నం: జితేంద్ర చౌదరి

నల్లగొండ | నవంబర్ 17 (ఎన్ టుడే న్యూస్):

ఆదివాసీ గిరిజనులకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ చైర్మన్, త్రిపుర మాజీ మంత్రి, ప్రతిపక్ష నాయకుడు జితేంద్ర చౌదరి ఆరోపించారు. నల్లగొండలోని జీఎం కన్వెన్షన్‌లో జరుగుతున్న అఖిల భారత కిసాన్ సభ 36వ మహాసభలకు హాజరైన సందర్భంగా మహాసభ ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

1/70 చట్టం, పీసా చట్టాలను నిర్వీర్యం చేస్తూ వేలాది ఎకరాల అటవీ భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జితేంద్ర చౌదరి విమర్శించారు. అటవీ సంరక్షణ నిబంధనలు, 2023 పేరుతో తీసుకొచ్చిన మార్పులు ఆదివాసీల హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు. తరతరాలుగా అడవులపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులను ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల పేరుతో నిర్వాసితులుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సనాతన ధర్మం పేరుతో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, వాటి అనుబంధ సంస్థలు ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, ఆహార అలవాట్లపై దాడి చేస్తున్నాయని, వారి ప్రత్యేక గుర్తింపును తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం–2006 ద్వారా ఆదివాసీలకు అటవీ భూములపై హక్కులు కల్పించాల్సి ఉండగా, మరోవైపు వారి భూములను బలవంతంగా లాక్కుంటున్నారని విమర్శించారు.

వచ్చే నెల డిసెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ సమావేశాల్లో ఈ అంశాలపై చర్చించి, భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు.

తెలంగాణ గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీరాం నాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నప్పటికీ గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలోని గిరిజనులు సాగు చేస్తున్న ఏడు లక్షల ఎకరాల పోడు భూములకు హక్కులు కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఒక్క ఎకరాకు కూడా హక్కులు కల్పించలేదని ఆరోపించారు. గిరిజనులకు ఇచ్చిన హామీల అమలు కోసం కలిసి వచ్చే గిరిజన సంఘాలతో ఐక్య ఉద్యమాలు చేపడతామని ప్రకటించారు.

ఈ విలేకరుల సమావేశంలో ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నాయకులు, తమిళనాడు మాజీ ఎమ్మెల్యే ఢిల్లీ బాబు, రాజస్థాన్‌కు చెందిన ధూలి చంద్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. ధర్మనాయక్, మధ్యప్రదేశ్‌కు చెందిన లోల్తా ప్రసాద్, రామ్ నారాయణ కురారియా, ఝార్ఖండ్‌కు చెందిన ప్రపుల్ లింగ్డా, తమిళనాడుకు చెందిన ఏ.వి. షణ్ముగం, సర్వరణ, పొన్నుస్వామి, కేంద్ర కమిటీ సభ్యుడు భూక్య వీరభద్రం, నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎర్ర నాయక్, ఆంగోత్ కృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.