తుఫాను ప్రభావంతో ఉధృతంగా చంపావతి నది
ఆంధ్రప్రదేశ్
/
విజయనగరం
నెల్లిమర్ల: తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు చంపావతి నదిలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో నది ఉధృతంగా ప్రవహిస్తూ ఆనకట్టపై నుంచి వరదనీరు పొంగిపొర్లుతోంది.
వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో చేపల వేటకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ చేపల వేట కోసం నదిలోకి దిగవద్దని అధికారులు సూచిస్తున్నారు. నది పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. వరద పరిస్థితుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.