BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 15 November 2026, 06:51 pm
Posted by : K MAHESH

పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
15 Nov, 2026 - 06:51 PM
24 వీక్షణలు

మహిళా సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యం.. అధికారంలోకి వచ్చిన తర్వాత 4.50 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు

వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

హనుమకొండ / నవంబర్ 15 / ఎన్ టుడే న్యూస్:

రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన అప్పులు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వివిధ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.

మల్లారెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనంతో పాటు వీఓ భవనాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజుతో కలిసి ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రారంభించారు. అంతకుముందు హనుమకొండకు చేరుకున్న మంత్రి సీతక్కకు ఎంపీ కడియం కావ్య పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం నూతనంగా మంజూరైన చేయూత పింఛన్లకు సంబంధించిన ఉత్తర్వులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుతో పాటు ప్రజా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో కొత్త పింఛన్లు మంజూరు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఉన్న పింఛన్లకు అదనంగా 4.50 లక్షల నూతన పింఛన్లు మంజూరు చేసిందని వెల్లడించారు.

ఒంటరి మహిళలు, వితంతువులు, నేత కార్మికులు, గీత కార్మికులు, దివ్యాంగులు సహా వివిధ వర్గాలకు పింఛన్లు అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. గతంలో రాష్ట్రంలో సుమారు 40 లక్షల పింఛన్లు ఉండగా, కొత్తగా మరో 4.50 లక్షల పింఛన్లు మంజూరు చేయడం ద్వారా మరింత మంది అర్హులకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తోందని వివరించారు.

ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు సొంతింటి కల సాకారం

గత పదేళ్లలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు అందించడంలో గత ప్రభుత్వం విఫలమైందని కడియం కావ్య విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తూ పేదలకు సొంతింటి కలను సాకారం చేసే దిశగా చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు విడతల్లో సుమారు 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా, ఇందుకోసం రూ.40 వేల కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. గతంలో నిర్మించినప్పటికీ నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్లను సైతం మరమ్మతులు చేయించి లబ్ధిదారులకు అందజేస్తున్నామని పేర్కొన్నారు.

పాత, కొత్త పింఛన్ల కోసం కలిపి ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. పేదల సంక్షేమం కోసం భారీ మొత్తంలో నిధులు వెచ్చిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తోందని అన్నారు.

మహిళా సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యత

మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఎంపీ పేర్కొన్నారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలతో మహిళలకు ఆర్థికంగా ఊరట కల్పిస్తోందన్నారు. మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగానే కాకుండా వ్యాపారవేత్తలుగా, ఆర్థికంగా స్వతంత్రంగా ఎదిగేలా ప్రోత్సహిస్తోందని వివరించారు.

ఆర్టీసీ బస్సుల నిర్వహణ, సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంకుల నిర్వహణ వంటి రంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పించడం మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిదర్శనమని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే సమాజం, దేశం అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. మహిళల సమస్యలను మహిళలే మరింత సమర్థవంతంగా అర్థం చేసుకోగలరని, మహిళలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మహిళా సంక్షేమ కార్యక్రమాల అమలులో మంత్రి సీతక్క కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

రాజ్యాంగ విలువల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం

కాంగ్రెస్ పార్టీ లౌకికవాదం, రాజ్యాంగ విలువలకు కట్టుబడి పనిచేస్తుందని కడియం కావ్య స్పష్టం చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల కారణంగానే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులుగా తాము ప్రజలకు సేవ చేసే అవకాశం పొందామని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, రాజ్యాంగం కల్పించిన హక్కుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఓట్ల తొలగింపు, ఓటు చోరీ వంటి అంశాలపై రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని పేర్కొంటూ, దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ప్రజల హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ గుండు సుధారాణి, స్థానిక సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.