BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 07:05 pm
Posted by : K MAHESH

రేషన్ డీలర్ సోమ మల్లేష్ యాదవ్ మృతి బాధాకరం

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
17 Nov, 2026 - 07:05 PM
22 వీక్షణలు

మృతుడి కుటుంబానికి అండగా ఉంటాం: తహసీల్దార్ చందా నరేష్

ప్రభుత్వ రేషన్ డీలర్ల సంఘం నాయకుల ఘన నివాళి

మహబూబాబాద్ జిల్లా | నెల్లికుదురు | నవంబర్ 17 (ఎన్ టుడే న్యూస్):

మండలంలోని ఆలేరు గ్రామానికి చెందిన ప్రభుత్వ రేషన్ డీలర్ సోమ మల్లేష్ యాదవ్ మృతి బాధాకరమని స్థానిక తహసీల్దార్ చందా నరేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంగళవారం మల్లేష్ యాదవ్ మృతి చెందడంతో ఆయన స్వగృహానికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ప్రభుత్వ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బాదం ఉప్పలయ్య, మండల అధ్యక్షుడు బానోతు రాజేశ్వర్ నాయక్, జిల్లా నాయకుడు కొయ్యేడి వెంకటేశ్వర్లు గౌడ్‌తో కలిసి తహసీల్దార్ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో మల్లేష్ యాదవ్ తండ్రి సోమ జనార్ధన్ అనారోగ్యంతో మృతి చెందారని, ఇప్పుడు కుమారుడు కూడా అనారోగ్యంతో మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందన్నారు. మల్లేష్ యాదవ్ రేషన్ డీలర్ల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని, అందరితో సన్నిహితంగా ఉండే వ్యక్తి మృతి చెందడం డీలర్ల సంక్షేమ సంఘానికి తీరని లోటని పేర్కొన్నారు.

మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకునేలా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్ఐ దార రామకృష్ణ, జీపీఓ రమేష్, రేషన్ డీలర్ల సంఘం నాయకులు మంద మహేష్, ఏర్పుల కిరణ్, మద్ది వెంకటేశ్వర్లు, బదావత్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.