బూరుగుగూడెం అభివృద్ధే లక్ష్యం.. సైకిల్ గుర్తుకు ఓటేయండి : బూబత్తుల నాగ స్వరూప
చాట్రాయి జెడ్పీటీసీ అభ్యర్థి తేళ్ళూరి శేఖర్, ఎంపీటీసీ అభ్యర్థి బూబత్తుల నాగ స్వరూప
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. చాట్రాయి జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ అభ్యర్థి తేళ్ళూరి శేఖర్, బూరుగుగూడెం మండల ప్రాదేశిక నియోజకవర్గ అభ్యర్థి బూబత్తుల నాగ స్వరూప తమ అనుచరులతో కలిసి ప్రచారంలో ముందంజలో సాగుతున్నారు. ఇందులో భాగంగా రాత్రి బూరుగుగూడెం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి, ప్రజలను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ, గతంలో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉన్న సమయంలో బూరుగుగూడెం గ్రామానికి ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత లభించిందని పేర్కొన్నారు. సిమెంటు రహదారుల నిర్మాణం, ఎల్ఓసీల ద్వారా వైద్య సహాయం, అర్హులకు పింఛన్ల మంజూరు, వాటర్ ట్యాంకుల వంటి సదుపాయాల కల్పనతో ప్రజలకు ప్రయోజనం చేకూరుతోందని వివరించారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన తమ ప్రధాన లక్ష్యాలని అభ్యర్థులు తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని, గ్రామంలో తాగునీరు, రహదారులు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే బూరుగుగూడెం గ్రామంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తామని స్పష్టం చేశారు.
ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజలతో మమేకమవుతూ కూటమి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన అభ్యర్థులు, రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తమకు విజయాన్ని అందించాలని కోరారు. గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలసాని సూర్యనారాయణ, వెల్లంకి శ్రీమన్నారాయణ, గ్రంధాల జయప్రకాష్, వంగాల మాధవరెడ్డి, రాజబోయిన దశరథ రామరాజు, బొర్ర నాగమల్లేశ్వరి, బొర్ర నాగేశ్వరరావు, బూబత్తుల చెన్నారావు, కల్లేపల్లి ప్రభాకర్, బయగాని మల్లికార్జున రావు, మిద్దె సత్యనారాయణ(అడవి సత్యం), చీపు మల్లేశ్వరరావు, మిద్దె రాము, ఉయ్యాల దిలీప్ తదితరులు పాల్గొన్నారు