BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 02:56 pm
Posted by : PAGADALA DEVAIAH

ఉద్యమ జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించి న్యాయం చేయాలి

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
17 Nov, 2026 - 02:56 PM
34 వీక్షణలు

శ్రీకాంతాచారి విగ్రహానికి వినతిపత్రం అందజేసిన ఎల్బీనగర్ ఉద్యమ జర్నలిస్టులు

ఎల్బీనగర్ | నవంబర్ 17 | ఎన్ టుడే న్యూస్

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమ జర్నలిస్టులను ప్రభుత్వం విస్మరించిందని ఎల్బీనగర్‌కు చెందిన ఉద్యమ జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారిని సాక్షిగా చేసుకుని, ఆయన విగ్రహానికి వినతిపత్రం అందజేస్తూ నిరసన తెలిపారు.

తెలంగాణ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడంలో ఉద్యమ జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని వారు పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు, తెలంగాణ ఆకాంక్షను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేసిన తమను ప్రభుత్వం ఇప్పటికీ గుర్తించకపోవడం బాధాకరమని అన్నారు.

ఇకనైనా ప్రభుత్వం నిజమైన ఉద్యమ జర్నలిస్టులను గుర్తించి, వారికి దక్కాల్సిన హక్కులు కల్పించాలని కోరారు. జర్నలిస్టులకు ప్రభుత్వం తరఫున అందించాల్సిన అన్ని రకాల రాయితీలు, సంక్షేమ ప్రయోజనాలను అర్హులైన వారికి అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదే సమయంలో కొంతమంది జర్నలిస్టులు తాము ఉద్యమ జర్నలిస్టులమంటూ సమావేశాలు నిర్వహిస్తూ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. ఉద్యమ కాలంలో జర్నలిస్టులుగా పనిచేసిన వారందరినీ ఉద్యమ జర్నలిస్టులుగా పరిగణించలేమని, ఉద్యమంలో ప్రత్యక్షంగా పాత్ర పోషించిన నిజమైన ఉద్యమ జర్నలిస్టులను గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఉద్యమ జర్నలిస్టుల పేరుతో అనర్హులు లబ్ధి పొందకుండా నిజమైన ఉద్యమ జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమ జర్నలిస్టుల పాత్రను గుర్తించి, వారికి న్యాయం చేయాలని ఎల్బీనగర్ ఉద్యమ జర్నలిస్టులు ప్రభుత్వాన్ని కోరారు.