BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 15 November 2026, 04:11 am
Posted by : K MAHESH

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
15 Nov, 2026 - 04:11 AM
17 వీక్షణలు

నర్సంపేట నియోజకవర్గంలో 1,187 మందికి చేయూత పెన్షన్ల పంపిణీ.. లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే, కలెక్టర్ డాక్టర్ సత్య శారద

నర్సంపేట: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. పేదలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు చేయూత పెన్షన్లను అందిస్తున్నామని పేర్కొన్నారు.

నర్సంపేట నియోజకవర్గంలో శనివారం నిర్వహించిన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు. నియోజకవర్గ పరిధిలో వివిధ వర్గాలకు చెందిన మొత్తం 1,187 మందికి పెన్షన్లు మంజూరు చేశారు.

పెన్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి. 133 మంది గీత కార్మికులకు, 130 మంది ఒంటరి మహిళలకు, 638 మంది వితంతువులకు ఒక్కొక్కరికి నెలకు రూ.2,016 చొప్పున పెన్షన్ మంజూరైంది. అదేవిధంగా 286 మంది దివ్యాంగులకు ఒక్కొక్కరికి నెలకు రూ.4,016 చొప్పున పెన్షన్లు అందించనున్నారు. మొత్తంగా 1,187 మంది లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందనుంది.

అర్హులైన వారెవరూ పెన్షన్‌కు దూరం కావొద్దు: ఎమ్మెల్యే

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.. సమాజంలోని పేద, బలహీన వర్గాలకు అండగా నిలవాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులకు చేయూత పెన్షన్ల ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటామని, ఎవరూ అర్హత ఉండి కూడా పింఛన్‌కు దూరం కాకూడదని అన్నారు.

ప్రభుత్వం ప్రతి నెలా అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా పెన్షన్ మొత్తాన్ని జమ చేస్తోందని తెలిపారు. గతంలో పెన్షన్ల కోసం లబ్ధిదారులు ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఉండేవని, ప్రస్తుతం అర్హులకు సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

నర్సంపేట నియోజకవర్గంలో ఒక్క అర్హుడూ మిగిలిపోకుండా గ్రామాల వారీగా పరిశీలన చేపట్టి పెన్షన్లు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పెన్షన్ల మంజూరు విషయంలో ఎవరికైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు: కలెక్టర్

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు తదితర వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించడమే చేయూత పెన్షన్ల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హుల గుర్తింపు, పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) వై.వి. గణేష్, మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం లక్ష్మి, వైస్ చైర్మన్ గంధపు నరేందర్, ఆర్డీవో ఉమారాణి, డీఆర్డీవో నాగపద్మజ, తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్ రావు, మున్సిపల్ కమిషనర్ నరేష్ రెడ్డి, సంబంధిత వార్డు కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.