BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 17 February 2026, 11:23 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి

తెలంగాణ
17 Feb, 2026 - 11:23 AM
350 వీక్షణలు
ప్రత్యేక సమగ్ర సవరణలో మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం దృష్ట్యా మ్యాపింగ్ ప్రక్రియను ఖచ్చితంగా, పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బూత్ స్థాయి అధికారులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ తిరిగి మ్యాపింగ్ పూర్తి చేయాలని, గ్రామ పాలన అధికారులు మరియు ఇతర సిబ్బందిని సహాయకులుగా నియమించి ప్రక్రియను త్వరితగతిన ముగించాలన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయం చేసి, బూత్ స్థాయి ఏజెంట్ల నియామకంపై అవగాహన కల్పించాలని తెలిపారు. మ్యాపింగ్ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా బూత్ స్థాయి అధికారుల పర్యవేక్షకులు, ఏఈఆర్‌ఓలు సమగ్రంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. బూత్ స్థాయి అధికారుల వివరాలు ప్రజలకు తెలిసేలా ప్రచారం చేపట్టాలని సూచించారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ఫారం 6, 7, 8 దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, తహసీల్దార్లు, ఎన్నికల అధికారులు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. #ElectionUpdate #SpecialRevision #BoothLevelOfficers #ElectoralRoll #TelanganaElections Follow us on Website Facebook Instagram YouTube