BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 10 February 2026, 08:44 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మహాశివరాత్రికి పటిష్ట బందోబస్తు

తెలంగాణ
10 Feb, 2026 - 08:44 AM
387 వీక్షణలు
భక్తుల భద్రతే లక్ష్యం… మహాశివరాత్రికి పటిష్ట బందోబస్తు డ్రోన్లు, సీసీ కెమెరాలతో క్రౌడ్ మేనేజ్‌మెంట్‌కు ప్రాధాన్యం: జిల్లా ఎస్పీ బిందు మాధవ్ NTODAY NEWS: కాకినాడ జిల్లా, గొల్లప్రోలు ప్రతినిధి బోర శివారెడ్డి  రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి (IAS), జిల్లా ఎస్పీ బిందు మాధవ్ (IPS) పాల్గొని ఏర్పాట్లను సమీక్షించారు. ఈ నెల ఫిబ్రవరి 13 నుంచి 18 వరకు మహాశివరాత్రి పూజలు జరగనున్న నేపథ్యంలో, భారీగా తరలివచ్చే భక్తుల భద్రత దృష్ట్యా ముందస్తు ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు. లక్షకు పైగా భక్తుల రాక అంచనా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ముఖ్యంగా ఫిబ్రవరి 14, 15 తేదీల్లో -పిఠాపురం పాదగయ -సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయం ప్రాంతాల్లో లక్షకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. భద్రతా చర్యలు భక్తుల రద్దీని నియంత్రించేందుకు -డ్రోన్ కెమెరాలతో నిఘా -సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ -వాచ్ టవర్లు, కంపార్ట్మెంట్లు -కంట్రోల్ రూమ్ ఏర్పాటు -ట్రాఫిక్ నియంత్రణ -స్నాన ఘాట్లు, అన్నప్రసాద కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు వంటి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్‌ను విస్తృతంగా వినియోగించనున్నట్లు తెలిపారు. ఆలయాల్లో అదనపు సీసీ కెమెరాలు పిఠాపురం పాదగయలోని రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఇప్పటికే ఉన్న 14 సీసీ కెమెరాలకు అదనంగా మరో 16 కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సామర్లకోట ఆలయాల్లో కూడా సీసీ కెమెరాలు సమృద్ధిగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రత్యేక ఏర్పాట్లు చిన్నపిల్లలు, వృద్ధుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించడంతో పాటు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. పిఠాపురం, సామర్లకోటతో పాటు 10 వేల లోపు భక్తులు వచ్చే మరో 15 శైవ ఆలయాలను గుర్తించి అక్కడ కూడా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా డీఆర్వోతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. #Mahashivaratri #DevoteeSafety #CrowdManagement #KakinadaDistrict #TempleSecurity #DroneSurveillance #CCTVMonitoring #NtodayNews Follow us on Website Facebook Instagram YouTube