BREAKING
thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన
Date of Publish : 14 September 2026, 05:31 pm
Posted by : DAVU RAVINDER REDDY

పండగ పూట చౌదరిగూడలో విషాదం

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
14 Sep, 2026 - 05:31 PM
2 వీక్షణలు

ఘట్కేసర్ / Ntoday News: వినాయక విగ్రహం కొనుగోలు చేయడానికి వెళ్లిన వ్యక్తులకు, విగ్రహాల విక్రయ దారులకు మధ్య జరిగిన ఘర్షణలో ఒక యువకుడు మృతి చెందగా మరో యువకుడికి తీవ్రగాయాలైన ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

స్థానికుల కథనం ప్రకారం చౌదరిగూడ ప్రాంతానికి చెందిన కొందరు యువకులు ఆదివారం అర్ధరాత్రి వినాయక విగ్రహం కొనుగోలు చేసేందుకు జోడిమెట్ల సమీపంలోని వినాయక విగ్రహాల షెడ్డు వద్దకు వెళ్లారు. అక్కడ విగ్రహాలు విక్రయిస్తున్న వారితో ధర, కొనుగోలు విషయంలో మాటామాటా పెరిగి ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఘర్షణలో విగ్రహాలు విక్రయిస్తున్న రాజస్థాన్కు చెందిన చోగారామ్ అనే వ్యక్తి తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడే ఉన్న ఉన్న చొగారామ్ కుటుంబ సభ్యులు, మరికొంతమంది మూకుమ్మడిగా ఎదురు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో చౌదరిగూడకు చెందిన పసులాది కిరణ్ (34) అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చికిత్స కోసం అక్కడే ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. కిరణ్ మృతి చెందడంతో దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చౌదరిగూడ వాసులు  డిమాండ్ చేస్తూ వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి పై అర్దరాత్రి ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. సంఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడికి పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.