BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 30 July 2026, 06:56 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jul, 2026 - 06:56 PM
55 వీక్షణలు

అమరావతి, జూలై 30: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ అయ్యారు. ఏలేరు జలాశయం నుంచి కాకినాడ జిల్లాకు 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినందుకు మంత్రి నిమ్మల రామానాయుడు ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొనే అవకాశమున్న సూపర్ ఎల్‌నినో పరిస్థితులు, సాగునీటి సంక్షోభంపై ఇద్దరు చర్చించారు. రైతులకు పరిస్థితులపై స్పష్టమైన అవగాహన కల్పించాలని, ఇందుకోసం ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించి వాస్తవ పరిస్థితులను వివరించాలని పవన్ కల్యాణ్ సూచించారు.

అలాగే, సూపర్ ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే నీటి కొరతను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ చర్యలపై అధికారులు దృష్టి సారించాలని, ముందస్తు ప్రణాళికలతో సాగునీటి నిర్వహణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం.