BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 29 July 2026, 03:29 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఉపాధ్యాయులు రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించాలి ఎంఈవో 1మాసగిరి శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jul, 2026 - 03:29 PM
82 వీక్షణలు

ఉపాధ్యాయులు రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించాలి ఎంఈవో 1మాసగిరి శ్రీనివాస్ 

చాట్రాయి: పాఠశాలల్లో విద్యార్థులకు అందించే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంఈఓ-1 మాసగిరి శ్రీనివాస్ సూచించారు. ప్రతి పాఠశాలలో ప్రతిరోజూ ఒక ఉపాధ్యాయుడిని మధ్యాహ్న భోజన పర్యవేక్షణకు నియమించి, సంబంధిత ఉపాధ్యాయుడు స్వయంగా భోజనాన్ని రుచి చూసి సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే విద్యార్థులకు వడ్డించాలని ఆదేశించారు. ఈ విషయంలో ప్రధానోపాధ్యాయులు అత్యంత బాధ్యతతో వ్యవహరించాలని పేర్కొన్నారు.


బుధవారం మండలంలోని ఎంపీయూపీఎస్ బూరుగుగూడెం పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.


అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, భోజన నాణ్యతపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ విద్య, పరిశుభ్రత, పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.