BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 02 June 2026, 10:24 am
Posted by : రావిపాటి ప్రభాకరావు

ఉప్పరపాలెం శివారులో జూదరుల అరెస్ట్ ​ఆరుగురు పట్టివేత..

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
02 Jun, 2026 - 10:24 AM
202 వీక్షణలు

ఉప్పరపాలెం శివారులో జూదరుల అరెస్ట్ ​ఆరుగురు పట్టివేత..రూ.3,200 స్వాధీనం.

​అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: ఎస్సై శివరామకృష్ణ.

​ఎడ్లపాడు మండల పరిధిలోని ఉప్పరపాలెం గ్రామ శివారులో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న జూదం తావులపై సోమవారం పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు.ఈ దాడిలో జూదం ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.​పోలీసుల కథనం ప్రకారం... ఉప్పరపాలెం గ్రామ శివారు ప్రాంతంలో కొందరు వ్యక్తులు చేరి జూదం ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు ఎడ్లపాడు పోలీసులు సదురు ప్రాంతంపై నిఘా పెట్టారు. పక్కా ప్రణాళికతో దాడి చేసి,జూదమాడుతున్న ఆరుగురినిపట్టుకున్నారు. వారి వద్ద నుండి జూదానికిఉపయోగిస్తున్న రూ. 3,200/- నగదును,  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

​ఈ సందర్భంగా ఎడ్లపాడు ఎస్సై శివరామకృష్ణ మాట్లాడుతూ... ప్రజలు ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా సహించేది లేదని,అసాంఘిక పనులకు దూరంగా ఉండాలనిహెచ్చరించారు. మండల పరిధిలో ఎక్కడైనా జూదం, బెట్టింగులు లేదా ఇతర అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఆయన ప్రజలను కోరారు.సమాచారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతామని ఎస్సై స్పష్టం చేశారు.