BREAKING
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు
Date of Publish : 16 March 2026, 10:06 am
Posted by : ఉపారపు లక్ష్మణ్

వేములవాడలో వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు

తెలంగాణ
/ రాజన్న సిరిసిల్ల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
16 Mar, 2026 - 10:06 AM
201 వీక్షణలు

మార్చి 27న శ్రీ సీతారాముల కల్యాణం

​వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది మరియు శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థాన అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


​మార్చి 19 (గురువారం): శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని సాయంత్రం 4:30 గంటలకు శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో 'పంచాంగ శ్రవణం' నిర్వహించబడుతుంది.

​నవరాత్రి ఉత్సవాలు: మార్చి 19 నుండి మార్చి 27 వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహించబడతాయి.

​మార్చి 27 (శుక్రవారం) - శ్రీరామనవమి: ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు పార్కింగ్ స్థలం వద్ద గల శివార్చన వేదికపై శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది.

​అనంతరం సాయంత్రం 5:00 గంటలకు స్వామివారి రథోత్సవం, రాత్రి 7:30 గంటలకు డోలోత్సవం నిర్వహించనున్నారు.

​భక్తులకు విజ్ఞప్తి:

​ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కార్యనిర్వహణాధికారి కోరారు. అలాగే, స్వామివారికి మొక్కుబడిగా సమర్పించే కోడెలు, ఆవులు ఆరోగ్యంగా ఉండాలని, అంగవైకల్యం లేని వాటిని మాత్రమే సమర్పించాలని సూచించారు. దేవస్థానంలో రూ. 1,116/- చెల్లించి నిలువు దోపిడీ సమర్పించే సౌకర్యం కూడా కల్పించబడింది.