BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 24 August 2026, 08:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వైద్య సహాయానికి తక్షణ స్పందన..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 08:53 PM
66 వీక్షణలు

వైద్య సహాయానికి తక్షణ స్పందన.. రూ.2 లక్షల ఎల్‌ఓసీ అందించిన ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

చింతలపూడి: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితిలో ఉన్న చింతలపూడి నగర పంచాయతీకి చెందిన మక్కిన ప్రమీల, వెంకటేశ్వరరావు దంపతులకు శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ అండగా నిలిచారు.

వైద్య చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి రూ.2 లక్షల విలువైన ఎల్‌ఓసీ లేఖను అందించారు. ఆపద సమయంలో ఆదుకున్న ఎమ్మెల్యేకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజా సమస్యలను తన సమస్యలుగా భావిస్తూ, అత్యవసర సమయాల్లో ప్రజలకు అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మానవతా దృక్పథాన్ని పలువురు అభినందించారు.

ఈ కార్యక్రమంలో చింతలపూడి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తాటి అప్పారావు, చింతలపూడి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు చీదరాల మధుబాబు, పోతునూరు సొసైటీ అధ్యక్షుడు శీతల గాంధీ, జనసేన నాయకుడు నారపాము ఏసుబాబు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతూ, ప్రతి ఆపదలో ప్రజలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ తెలిపారు.