BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 05 April 2026, 11:08 am
Posted by : NTODAY NEWS

వెల్లంకిలో ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
05 Apr, 2026 - 11:08 AM
283 వీక్షణలు

యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో ఆదివారం ఆది జాంబవ యువజన సంఘం ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, పేద ప్రజల ఆశాజ్యోతి, దళితుల హక్కుల కోసం జీవితాంతం సేవ చేసిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. నాయకులు ఆయన సేవలను స్మరించుకుంటూ, సమానత్వం మరియు సామాజిక న్యాయం కోసం చేసిన కృషి నేటి తరాలకు ఆదర్శమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆది జాంబవ యువజన సంఘం అధ్యక్షులు, నాలుగో వార్డు సభ్యులు సండ్ల లింగయ్య, ప్రధాన కార్యదర్శి నకిరేకంటి (బర్ల) రవి, కోశాధికారి కురుమ వెంకటేష్, సహాయ కార్యదర్శులు జింక లింగయ్య, చెన్ని స్వామి పాల్గొన్నారు. అలాగే కార్యవర్గ సభ్యులు గూని రాజు, కందాల అంజయ్య, మూడో వార్డు సభ్యులు నకిరేకంటి నరేష్ తదితరులు హాజరయ్యారు.

కుల పెద్దలు ఎర్రోళ్ల నరసింహ, తలారి నరసింహ, నకిరేకంటి రవీందర్, బర్ల బాబురావు, నకిరేకంటి ఎల్లయ్య, జంపాల అరవింద్, నకిరేకంటి డా. అశోక్, నకిరేకంటి నరేందర్, జింక గోవర్ధన్, కురుమ మహేందర్, నకిరేకంటి గణేష్, లింగయ్య, అనిల్, యాదయ్య, మహేష్, శ్రీరాములు, రాములు, శంకరయ్య, యాదయ్య తదితర గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి ఆలోచనలు సమాజానికి మార్గదర్శకమని, ఆయన చూపిన దారిలో నడవడం ద్వారా సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.