BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 01 August 2026, 06:34 am
Posted by : గంగుల రాజ్ కుమార్

వెంకట్రావుపేట పీహెచ్‌సీని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల తనిఖీ

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
01 Aug, 2026 - 06:34 AM
130 వీక్షణలు

మంచిర్యాల జిల్లా | లక్షెట్టిపేట మండలం | NTODAY NEWS

లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్లను తనిఖీ చేసిన కలెక్టర్, రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అనంతరం గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి, పనులు నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ (ఎంఆర్ఓ), ఎంపీడీఓ, గ్రామ సర్పంచ్ నలిమెల రాజు, జిల్లా ఆర్టీఏ సభ్యుడు అంకతి శ్రీనివాస్ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.