BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 01 August 2026, 07:47 am
Posted by : కూనురు మధు

విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలని భువనగిరిలో మహాధర్నా

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
01 Aug, 2026 - 07:47 AM
44 వీక్షణలు

విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలని భువనగిరిలో మహాధర్నా

విద్యార్థులకు రావలసిన ₹10,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం భువనగిరిలో వేలాది మంది విద్యార్థులతో భారీ మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ 10,000 కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని, విద్యార్థుల వ్యతిరేక జీవో నంబర్ 9 మరియు ఆర్ఆర్ (RR) యాక్ట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య మరియు విద్యార్థుల స్కాలర్‌షిప్‌లపై సీఎం చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. మూసీ సుందరీకరణ, ఫోర్త్ సిటీకి లక్షల కోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వం, విద్యార్థుల ఫీజులకు నిధులు లేవనడం విడ్డూరమని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ విమర్శించారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు పూర్తి ఫీజును ప్రభుత్వమే భరించాలని,   

​సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించి, మెస్ చార్జీలు పెంచాలని కోరారు. ​మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన 5 లక్షల రూపాయల భరోసా కార్డు అందరికీ వర్తింపజేయాలి అని .​ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి, ప్రత్యేక విద్యాశాఖ మంత్రిని నియమించాలని అన్నారు. డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే ఎంపీ ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున రాస్తారోకోలు, ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి మరియు బీసీ సంఘాల నాయకులు పల్లపు దుర్గయ్య, సాయిలు, వేముల అనిల్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.