BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 01 April 2026, 07:39 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విద్యాసేవకుడు చెన్నకేశవరెడ్డి కన్నుమూత… చాట్రాయిలో విషాదఛాయలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Apr, 2026 - 07:39 AM
477 వీక్షణలు

విద్యాసేవకుడు చెన్నకేశవరెడ్డి కన్నుమూత… చాట్రాయిలో విషాదఛాయలు

చాట్రాయి ఏప్రిల్ 1: చాట్రాయి వికాస్ పబ్లిక్ స్కూల్ అధినేత పాములపాటి చెన్నకేశవరెడ్డి మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో పోరాడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే చాట్రాయి మండలంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

గ్రామీణ విద్యాభివృద్ధికి జీవితాన్నే అంకితం చేసిన చెన్నకేశవరెడ్డి, సుమారు రెండు దశాబ్దాల క్రితం వికాస్ పబ్లిక్ స్కూల్‌ను స్థాపించి, సాధారణ కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించే దీక్షతో ముందుకు సాగారు. పేద విద్యార్థులకు ఫీజుల భారాన్ని తగ్గిస్తూ, కొంతమందికి పూర్తిగా ఉచిత విద్య అందించి, వారి భవిష్యత్తుకు బాటలు వేసిన గురువుగా పేరుపొందారు. ఆయన చేతిలో చదువుకున్న అనేక మంది విద్యార్థులు నేడు మంచి ఉద్యోగాల్లో స్థిరపడి సమాజంలో గౌరవప్రద స్థానం సంపాదించారు.

“విద్యే అసలైన సంపద” అనే నమ్మకంతో విద్యాసేవలో నిస్వార్థంగా పనిచేసిన చెన్నకేశవరెడ్డి, క్రమశిక్షణకు ప్రతీకగా, ప్రేమాభిమానాలకు నిలయంగా గుర్తింపు పొందారు. ఆయన మరణంతో విద్యారంగం ఒక గొప్ప సేవకుడిని కోల్పోయిందని స్థానికులు భావోద్వేగానికి లోనవుతున్నారు.

ఆయనకు భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. మృతి వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. బంధువులు, శిష్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆయనకు నివాళులు అర్పించేందుకు సిద్ధమవుతున్నారు. మృతదేహాన్ని చాట్రాయికి తీసుకువస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.