BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 26 April 2026, 09:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విజయవాడ బాల భవన్ లో కామ్రేడ్ శేషగిరి ప్రధమ వర్ధంతి సభ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Apr, 2026 - 09:40 PM
153 వీక్షణలు

విజయవాడ బాల భవన్ లో కామ్రేడ్ శేషగిరి ప్రధమ వర్ధంతి సభ

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ కామ్రేడ్ శేషగిరి యొక్క ప్రధమ వర్ధంతి సభలో ప్రసంగిస్తూ, మే 1 నుంచి జరగనున్న మేడే ఉత్సవాల్లో ఏఐసీసీ టీయూ కార్మికులు నాలుగు లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ, మోడీ పాలనలో ఉత్తర ప్రదేశ్ నోయిడాలో కార్మికుల పోరాటం చరిత్ర సృష్టించిందని, జాతీయ రహదారిపై వారి నిరసన ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి అని చెప్పారు. హరినాథ్ హెచ్చరించారు, "కార్మిక లోకం తిరుగుబాటు చేస్తే పారిశ్రామిక వర్గాలు, పాలకవర్గాలు దిగిపోవాల్సి ఉంటాయి." ఆయన మోడీ పాలనపై విమర్శలు చేస్తూ, ఇరాన్ పై అమెరికా దాడులను ఆపాలని మోడీ నోరు విప్పకపోవడం చాలా బాధాకరమని చెప్పారు. ఇంకా, రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు ఆకాశాన్నింటి చేరాయని అన్నారు. బిజెపి పై ఎద్దేవా చేస్తూ, బాబు, జగన్, పవన్ అనే పేర్లతో విమర్శలు గుప్పించారు. ఎన్డీఏ భాగస్వామి పార్టీలకు ప్రత్యామ్నాయంగా వామపక్షాలు ప్రజాస్వామ్య శక్తులతో ఐక్యంగా వచ్చే అవసరం ఉందని ఆయన సూచించారు. డీలిమిటేషన్ బిల్లుతో మహిళా బిల్లు కలిపి 131వ రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా ఇండియా కూటమి వామపక్షాలు ఓటు వేసాయని తెలిపారు. ఈ సభలో బుగతా బంగార్రావు, పత్తిపాటి సత్యనారాయణ, సుమతి, ఆర్ నాగమణి, తామాడ అరుణ, ఏఎస్ఎస్ రాంప్రసాద్, రాందేవ్, ఉదయ్ కిరణ్, ఈశ్వర్, వేమన లోకం, భాస్కరరావు, హుస్సేన్ శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు.