BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 27 August 2026, 06:11 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విజయవాడ: గోదావరి పుష్కరాల నిధులపై పబ్లిక్ ఆడిట్ నిర్వహించాలి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 06:11 AM
58 వీక్షణలు

విజయవాడ: గోదావరి పుష్కరాల నిధులపై పబ్లిక్ ఆడిట్ నిర్వహించాలి: సీపీఎం డిమాండ్

యాత్రికుల భద్రత, సౌకర్యాలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి

విజయవాడ, ఆగస్టు 27: గోదావరి పుష్కరాల కోసం ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.4 వేల కోట్ల నిధులను యాత్రికుల అవసరాలు, భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఖర్చు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

పుష్కరాల పనులపై నిర్ణయాలు త్వరగా తీసుకుని, తగిన ముందస్తు ప్రణాళికతో పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలని ఆయన కోరారు. గతంలో పుష్కరాల పనుల నిర్ణయం, ప్రారంభం, పూర్తిలో తీవ్ర జాప్యం జరిగి యాత్రికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో వైఫల్యాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.

హడావుడిగా పనులు చేపట్టడం వల్ల నాణ్యత లోపాలు, అవినీతి, అవకతవకల ఆరోపణలు వచ్చాయని, కొన్ని పనులు పుష్కరాలు జరుగుతున్న సమయంలోనే దెబ్బతిన్న ఘటనలు ఉన్నాయని తెలిపారు.

తీర్థయాత్రలు, పుష్కరాలు, ఉత్సవాల్లో భక్తుల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీపీఎం కోరింది. గత పుష్కరాల్లో భద్రతా వైఫల్యాల కారణంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారని, బాధిత కుటుంబాలకు సరైన న్యాయం జరగలేదని గుర్తుచేశారు.

భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, యాత్రికుల ప్రాణాలు, సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యం చేయరాదని సూచించారు.

పుష్కరాల పనులు పారదర్శకంగా, నాణ్యతతో జరిగేలా నిరంతర పర్యవేక్షణ అవసరమని, అందుకోసం పబ్లిక్ ఆడిట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పనుల నిర్వహణలో అధికార దుర్వినియోగం, రాజకీయ జోక్యానికి తావులేకుండా చూడాలని కోరారు.

భక్తుల భద్రత, సౌకర్యాలు, పనుల నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ ముందుగానే సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది.