BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 28 August 2026, 06:09 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విజయవాడ పటమటలో డ్రగ్ అధికారుల మెరుపు దాడులు..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 06:09 AM
56 వీక్షణలు

విజయవాడ పటమటలో డ్రగ్ అధికారుల మెరుపు దాడులు.. మెడికల్ షాపుల్లో తనిఖీలు

శానిటైజర్ అమ్మకాలపై ఆరా.. మత్తు కోసం వినియోగిస్తున్నారన్న సమాచారంతో అప్రమత్తం

విజయవాడ పటమట సర్కిల్ పరిధిలో డ్రగ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని రకాల మత్తు మందుల విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పలు మెడికల్ షాపుల్లో సోదాలు చేపట్టారు.

ఇటీవల శానిటైజర్ అమ్మకాలు అనూహ్యంగా పెరగడంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మోతాదుకు మించి శానిటైజర్ విక్రయాలు జరుగుతున్నాయా అనే అంశంపై వివరాలు సేకరించారు.

శానిటైజర్‌ను కేవలం చేతుల శుభ్రత కోసం మాత్రమే ఉపయోగించాలని అధికారులు సూచించారు. కొందరు వ్యక్తులు మత్తు కోసం శానిటైజర్‌ను వినియోగిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఇలాంటి చర్యల వల్ల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు.

మెడికల్ షాపుల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, అనుమానాస్పద విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్ అధికారులు స్పష్టం చేశారు.