BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 28 August 2026, 06:10 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బెంగళూరు: నోట్లో గోల్డ్ క్యాప్సూల్స్.. ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ ప్రయాణికుడు

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 06:10 AM
86 వీక్షణలు

బెంగళూరు: నోట్లో గోల్డ్ క్యాప్సూల్స్.. ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ ప్రయాణికుడు

దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఓ ప్రయాణికుడు అక్రమంగా బంగారం తరలిస్తూ పట్టుబడ్డాడు.

బెంగళూరు నుంచి ఘాజియాబాద్‌కు వెళ్లేందుకు సిద్ధమైన ఆ ప్రయాణికుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహించారు.

ఈ క్రమంలో అతడి నోటిలో దాచుకున్న బంగారు క్యాప్సూల్స్‌ను గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు నిర్ధారించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కోసం కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. బంగారం విలువ, అక్రమ రవాణా వెనుక ఉన్న వ్యక్తుల వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.