BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

విజయవాడలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ సమావేశం.. రైతు సమస్యలపై కీలక తీర్మానాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Jul, 2026 - 07:02 AM
6 వీక్షణలు

విజయవాడలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ సమావేశం.. రైతు సమస్యలపై కీలక తీర్మానాలు

విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో గురువారం రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర చైర్మన్ కామన ప్రభాకరరావు అధ్యక్షతన జరిగింది. రాష్ట్రంలో కిసాన్ కాంగ్రెస్‌ను గ్రామస్థాయి వరకు మరింత బలోపేతం చేయడం, రైతు సమస్యలపై ఉద్యమాలను విస్తృతం చేయడం, ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులపై చర్చించడం సమావేశం ప్రధాన ఉద్దేశ్యంగా సాగింది.

సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. వర్షపాతం లోటు కారణంగా కరువు పరిస్థితులు ఏర్పడి వరి, పత్తి వంటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొన్ని ప్రాంతాల్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితులు ఏర్పడే అవకాశముందని కామన ప్రభాకరరావు పేర్కొన్నారు.

తక్కువ నీటి అవసరమయ్యే కంది, మినుములు, చిరుధాన్యాల వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, జలవనరుల నిర్వహణను మెరుగుపరచి బోర్‌వెల్ ఆధారిత రక్షణాత్మక సాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలని తీర్మానించారు. సహజ వ్యవసాయం, సేంద్రియ ఎరువుల వినియోగానికి ఇన్‌పుట్ సబ్సిడీలు, ప్రత్యామ్నాయ విత్తనాలను ప్రభుత్వం తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోని రైతులందరికీ ఉచిత పంట బీమా అమలు చేసి ప్రీమియాన్ని ప్రభుత్వమే భరించాలని, ముఖ్యంగా రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో పశుగ్రాసాన్ని ఉచితంగా అందించాలని సమావేశం కోరింది. యూరియా, డీఏపీ ఎరువులను ఎలాంటి కొరత లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేయాలని, యాప్‌లతో ఇబ్బందులు లేకుండా పంపిణీ చేయాలని తీర్మానించింది.

పొగాకు రైతులకు కిలోకు రూ.300 ధర కల్పించాలని, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.1,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి అన్ని రకాల పొగాకును కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇండెంట్ ఇచ్చినప్పటికీ కొనుగోలు చేయని కంపెనీలపై చర్యలు తీసుకుని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని కోరారు.

టమాటా రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని టమాటా ప్రాసెసింగ్ పరిశ్రమలు, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలని, కిలో టమాటాను రూ.30కు కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించింది. అలాగే ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే అందించాలని, 100 కౌంట్ రొయ్యలకు కిలోకు రూ.300 కనీస మద్దతు ధర నిర్ణయించాలని, సీడ్ ధరలను తగ్గించాలని కోరింది.

బొప్పాయి రైతులకు కిలోకు రూ.10 గిట్టుబాటు ధర కల్పించాలని, ధరల స్థిరీకరణ కోసం రూ.5,000 కోట్ల నిధిని ఏర్పాటు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా డ్రైనేజ్ వ్యవస్థలను ఆధునీకరించాలని, నక్కపల్లి మండలంలో భూసేకరణను 2013 భూసేకరణ చట్టం ప్రకారం అమలు చేయాలని సమావేశం తీర్మానించింది.

ఇటీవల దేశ రాజధానిలో విద్యార్థులు నిర్వహించిన ఉద్యమానికి మద్దతుగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన పోరాటాన్ని సమావేశం అభినందించింది.

సమావేశానికి ముఖ్య అతిథిగా పీసీసీ ఉపాధ్యక్షుడు, అడ్మిన్ ఇన్‌చార్జ్ కొలనుకొండ శివాజీ హాజరయ్యారు. రైతు సమస్యలపై కిసాన్ కాంగ్రెస్ మరింత చురుకుగా పోరాడాలని, రైతులకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన ప్రభాకరరావుతో పాటు రాష్ట్ర నాయకత్వం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.

సమావేశంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్లు మంగటి గోపాల్‌రెడ్డి, కాకర్ల హరిబాబు, మడంశెట్టి వేదాద్రి, దేసినీడి ఉదయస్కరరావు, వివిధ జిల్లాల చైర్మన్లు కే. జనార్ధనరెడ్డి, అల్లూరి మధురాజు, పంగి గంగాధర్, మట్టపర్తి రామమోహనరావు, బోనం రవికుమార్, ఆది రామమోహనరావు, బండ్ల సుబ్బారాయులు గౌడ్, గుమ్మళ్ల గోవిందరావు, మేడిశెట్టి నారయ్య, తుమ్మల నాగేశ్వరరావు, సిహెచ్ వేణుగోపాల్, ఎం. బాబీ తదితరులు పాల్గొన్నారు.