BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 07 April 2026, 08:31 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వికాస్‌ కళాశాల హాస్టల్‌లో విద్యార్థి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Apr, 2026 - 08:31 PM
592 వీక్షణలు

వికాస్‌ కళాశాల హాస్టల్‌లో విద్యార్థి ఆత్మహత్య

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట, ఏప్రిల్‌ 7:

స్థానిక వికాస్‌ విద్యాసంస్థల హాస్టల్‌లో మంగళవారం తెల్లవారుజామున ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామానికి చెందిన మల్లాది కార్తీక్‌ (20) ఇక్కడ డి.ఫార్మసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీ ఆవరణలోని హాస్టల్‌ మూడో అంతస్తులో ఉంటున్న కార్తీక్‌, తెల్లవారేసరికి తన గదిలో ఉరివేసుకొని విగతజీవిగా కనిపించాడు.

నిద్రలేచిన తోటి విద్యార్థులు కార్తీక్‌ ఉరివేసుకోవడం చూసి నిర్ఘాంతపోయి, వెంటనే కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కళాశాల చైర్మన్‌ను వివరణ కోరగా, విద్యార్థి మృతి చెందడం బాధాకరమని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

చేతికందివచ్చిన కొడుకు అకాల మరణంతో తాతకుంట్ల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.