BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 02 June 2026, 03:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేటలో 50% సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ – ఎరువుల గ్రామసభ నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 03:43 PM
134 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లో 50 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మి తెలిపారు.

ఈ సందర్భంగా కూటమి నాయకులు డాబా శ్రీనివాసు, ఆకుల రాధాకృష్ణ, ఏఎంసీ డైరెక్టర్ అభినేని చంద్రశేఖర్ బాబు, షేక్ యాసిన్ రైతులకు పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేశారు.

అనంతరం మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఎరువుల గ్రామసభ, ధర్తీ మాత బచావో క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, శాస్త్రీయ సాగు పద్ధతులను రైతులు అనుసరించాలని సూచించారు.

నేల సారవంతంగా ఉంటే పండే పంటలు నాణ్యంగా ఉండటంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని వివరించారు. అలాగే యూరియా, డీఏపీ గుళికల బదులుగా నానో యూరియా, నానో డీఏపీ వినియోగించాలని రైతులకు సూచించారు.

నానో యూరియా ధర రూ.366 కాగా, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో రూ.249కే అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. నానో ఎరువులను పిచికారీ చేయడం ద్వారా మొక్కలు అధిక శాతం పోషకాలను గ్రహించి, ఎరువుల వృథా తగ్గుతుందని వివరించారు.

మండలంలోని అన్ని సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాల్లో ఎంఆర్‌పీ ధరలకే ఎరువులు అందుబాటులో ఉంటాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అలాగే రైతులందరూ ఏపీఎంఎస్ 2.0 యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఈ-క్రాప్ నమోదు, ఎరువుల కొనుగోలు, ప్రభుత్వ పథకాల వివరాలు తెలుసుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఈఓ ఉషారాణి, రైతు సేవా కేంద్రాల సిబ్బంది, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు.