BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 05:27 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు బలి భర్తతో గొడవల నేపథ్యంలో ప్రియుడితో కలిసి రైలు కింద దూకిన వివాహిత

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Nov, 2026 - 05:27 AM
44 వీక్షణలు

 మండ్య: వివాహేతర సంబంధం చివరకు ఇద్దరి ప్రాణాలను బలిగొంది. భర్తతో ఏర్పడిన విభేదాలు, కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మండ్య తాలూకా ఇండువాల్‌ సమీపంలో చోటుచేసుకుంది. మండ్య తాలూకా గున్నైకనహళ్లి గ్రామానికి చెందిన సహాన (27) బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసేది. ఈ క్రమంలో పావగడ సమీపంలోని అరసికెరెకు చెందిన వీరేశ్‌తో పరిచయం ఏర్పడింది. అతడు బెంగళూరులో ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో వివాహం చేసుకున్నారు. దంపతులకు ఐదేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. అయితే కొంతకాలం తర్వాత రాపిడో బైక్‌ నడిపే రాహుల్‌తో సహానకు పరిచయం ఏర్పడింది. అది క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసినట్లు సమాచారం. ఈ విషయం భర్త వీరేశ్‌కు తెలియడంతో భార్యను మందలించాడు. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రాహుల్‌తో కలిసి మండ్యకు చేరుకున్న సహాన.. ఇండువాల్‌ సమీపంలో రైల్వే పట్టాల వద్దకు వెళ్లింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 1.50 గంటల సమయంలో మైసూరు–బెంగళూరు ప్రయాణికుల రైలు కిందపడి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం మండ్య వైద్య కళాశాల ఆసుపత్రి (మిమ్స్‌) మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు చిన్నారులు తల్లిని కోల్పోవడంతో ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.