BREAKING
ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు
Date of Publish : 04 September 2026, 12:56 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వల్లంపట్ల గ్రామానికి గర్వకారణం....

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Sep, 2026 - 12:56 PM
9 వీక్షణలు

వల్లంపట్ల గ్రామానికి గర్వకారణం.. అఖిల ఘన విజయం 440 మార్కులతో వైద్య విద్యలో సీటు.. పేదరికాన్ని జయించి ప్రతిభ చాటిన గురుకుల విద్యార్థిని

పేదరికాన్ని జయించి పట్టుదలతో చదివి వైద్య విద్యలో సీటు సాధించే స్థాయికి చేరుకున్న వల్లంపట్ల గ్రామానికి చెందిన శ్రీకాకుళపు అఖిల అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. నరసాపురం గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన అఖిల 440 మార్కులు సాధించి, విశాఖలోని ఎన్‌ఆర్‌ఐ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు సాధించబోతున్నారు. ఈ సందర్భంగా అఖిలకు గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ.కొండూరు మండలం వల్లంపట్ల గ్రామ వాస్తవ్యులైన శ్రీకాకుళపు బిక్షాలు, లక్ష్మీ దంపతుల కుమార్తె అఖిల. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ చదువుపై ఆసక్తి, పట్టుదలతో ముందుకు సాగారు. ఎన్నో ఇబ్బందులను అధిగమిస్తూ కష్టపడి చదివి 440 మార్కులు సాధించారు. వైద్య విద్యను అభ్యసించి భవిష్యత్తులో పేద ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో అఖిల ముందుకు సాగుతున్నారు.

బుడ్డయ్య అభినందనలు

ఈ సందర్భంగా నరసాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోటేటి సుబ్రహ్మణ్యేశ్వరరావు అలియాస్ బుడ్డయ్య మాట్లాడుతూ.. వల్లంపట్ల గ్రామానికి చెందిన శ్రీకాకుళపు అఖిల 440 మార్కులతో వైద్య విద్యలో సీటు సాధించే స్థాయికి చేరుకోవడం ఎంతో గర్వకారణమన్నారు. నరసాపురం గురుకుల పాఠశాలలో చదువుకున్న అఖిల తీవ్ర ఆర్థిక ఇబ్బందులను అధిగమించి పట్టుదలతో చదివి ఈ ఘనత సాధించడం అభినందనీయమన్నారు.

అఖిల విజయం వల్లంపట్ల గ్రామానికే కాకుండా నరసాపురం ప్రాంతానికి కూడా గర్వకారణమని బుడ్డయ్య పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి అఖిల సాధించిన విజయం ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకమన్నారు. విద్యార్థులు అఖిలను ఆదర్శంగా తీసుకుని కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.

అఖిల భవిష్యత్తులో మంచి వైద్యురాలిగా ఎదిగి ముఖ్యంగా పేద, బడుగు వర్గాల ప్రజలకు సేవ చేయాలని బుడ్డయ్య ఆకాంక్షించారు. అఖిలకు, ఆమె తల్లిదండ్రులు బిక్షాలు, లక్ష్మీకి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అఖిల మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

అఖిల సాధించిన విజయంతో వల్లంపట్ల గ్రామంలో ఆనందం నెలకొంది. ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అఖిల విజయాన్ని యువతకు, విద్యార్థులకు ఆదర్శంగా నిలిచే విజయంగా పలువురు అభివర్ణిస్తున్నారు.