BREAKING
thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు
Date of Publish : 02 August 2026, 03:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వర్షాల కోసం ముత్యాలమ్మకు 101 బిందెలతో జలాభిషేకం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Aug, 2026 - 03:16 PM
61 వీక్షణలు

వర్షాల కోసం ముత్యాలమ్మకు 101 బిందెలతో జలాభిషేకం

  • సింగగూడెంలో భక్తిశ్రద్ధలతో మహిళల బోనాల ఊరేగింపు

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం సింగగూడెం గ్రామంలో ఆదివారం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగా పండాలని కోరుతూ ముత్యాలమ్మ అమ్మవారికి 101 బిందెలతో జలాభిషేకం నిర్వహించారు.

గ్రామంలోని రామాలయం నుంచి మహిళలు బోనాలు, పసుపు, కుంకుమ, పండ్లు, ఫలహారాలతో భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా బయలుదేరారు. అనంతరం జగనన్న కాలనీలో కొలువై ఉన్న ముత్యాలమ్మ అమ్మవారికి చీర, సారెతో పాటు పసుపు, కుంకుమ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 101 బిందెలతో అమ్మవారికి జలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా సకాలంలో వర్షాలు కురవాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో ముత్యాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని భక్తిపూర్వకంగా నిర్వహించారు.