BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 26 July 2026, 08:43 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వర్షాలు కురవాలని పెనుగొలనులో నగర సంకీర్తన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jul, 2026 - 08:43 AM
108 వీక్షణలు

పెనుగొలను, జూలై 26: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో సకాలంలో వర్షాలు కురవాలని కోరుతూ ఆదివారం భక్తులు నగర సంకీర్తన నిర్వహించారు.

ఈ సందర్భంగా శిరిడి సాయిబాబాకు అభిషేకం చేసి నూతన వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం సాయిబాబా ఆలయం నుంచి భగవన్నామస్మరణ చేస్తూ గ్రామ ప్రధాన వీధుల్లో నగర సంకీర్తన నిర్వహించారు. కార్యక్రమంలో సత్యసాయి సేవా కమిటీ సభ్యులు డా. జి. నరసింహారావు, సుగల హనుమంతరావు, పారేపల్లి కృష్ణారావు, సుగ్గల విష్ణు తదితరులు పాల్గొన్నారు.

శనివారం రాత్రి గ్రామ బొడ్రాయి సెంటర్‌లోని శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఏకశిల విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్త బృందం ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం, భజన కార్యక్రమం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు బొలగాని నాగయ్య, కోట దాసు తెలిపారు.

ఈనెల 29న గురుపౌర్ణమి సందర్భంగా పెనుగొలను శివాలయం ప్రాంగణంలోని శిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు దాములూరి సత్యనారాయణ శర్మ తెలిపారు. గురువుల సన్మానం, సాయిబాబాకు దీపోత్సవం, భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.