BREAKING
thumb వైసీపీని వీడి టీడీపీలో చేరిన 26వ వార్డు ముస్లిం మైనార్టీ కుటుంబాలు thumb తెలంగాణ రైతంగా సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే హక్కు బీజేపీకి ఎక్కడిది? thumb నాగార్జున కుటుంబానికి అండగా ఉంటాం.. భూమా అఖిలప్రియ thumb ప్రథమ నందీశ్వర ఆలయ మార్గంలో బ్రిడ్జి దెబ్బతినడంతో భక్తులకు ఇబ్బందులు thumb బత్తలూరులో రాముల వారి ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా అన్నదానం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb వైసీపీని వీడి టీడీపీలో చేరిన 26వ వార్డు ముస్లిం మైనార్టీ కుటుంబాలు thumb తెలంగాణ రైతంగా సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే హక్కు బీజేపీకి ఎక్కడిది? thumb నాగార్జున కుటుంబానికి అండగా ఉంటాం.. భూమా అఖిలప్రియ thumb ప్రథమ నందీశ్వర ఆలయ మార్గంలో బ్రిడ్జి దెబ్బతినడంతో భక్తులకు ఇబ్బందులు thumb బత్తలూరులో రాముల వారి ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా అన్నదానం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు
Date of Publish : 06 August 2026, 07:26 pm
Posted by : కూనురు మధు

వ్యక్తి ఆకస్మిక మృతి : కేసు నమోదు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
06 Aug, 2026 - 07:26 PM
233 వీక్షణలు

వ్యక్తి ఆకస్మిక మృతి : కేసు నమోదు

యాదాద్రి భువనగిరి జిల్లా ​రామన్నపేట  మండల పరిధిలోని దుబ్బాక గ్రామానికి చెందిన రేవనాల ఐలయ్య (46) అనే వ్యక్తి ఆకస్మికంగా అస్వస్థతకు గురై మృతి మృతి చెందాడు రామన్నపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 5న  సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో ఐలయ్య తన భార్య పద్మ, కుమార్తె శివమణితో కలిసి దుబ్బాక రోడ్డులో ఉన్న తమ వ్యవసాయ పొలానికి వెళ్లారు. పనులు ముగించుకుని సాయంత్రం 5:00 గంటలకు ఇంటికి తిరిగి వచ్చారు. ​రాత్రి భోజనం చేసిన అనంతరం నిద్రపోయేందుకు సిద్ధమవుతున్న క్రమంలో ఐలయ్య ఒక్కసారిగా నేలపై పడిపోయారు. నోటి నుంచి నురుగు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురై, రాత్రి 10:30 గంటల సమయంలో వెంటనే ఆయనను రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

​అక్కడ విధుల్లో ఉన్న వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించి రాత్రి 11:00 గంటలకు ఐలయ్య మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య రేవనాల పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామన్నపేట ఎస్సై సతీష్ కేసు నమోదు చేసుకుని, ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.