విజయసాయిరెడ్డి కొత్త మీడియా సంస్థ.. ‘VSR Media’ ప్రారంభం
జాతీయం
హైదరాబాద్: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త మీడియా సంస్థను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ‘కే క్రియేషన్స్’ సంస్థ ఆధ్వర్యంలో ‘VSR Media’ పేరుతో కొత్త మీడియా వేదికను ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రకటించారు. ప్రజలకు సంబంధించిన అంశాలు, ప్రజల సమస్యలు, సమాజంలో చోటుచేసుకునే పరిణామాలను ప్రతిబింబించేలా ‘VSR Media’ను ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ‘VSR Media – Voice of the People’ అనే నినాదంతో ఈ కొత్త మీడియా వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న విజయసాయిరెడ్డి మీడియా రంగంలోకి అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది.