BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 15 November 2026, 06:53 pm
Posted by : K MAHESH

బిర్సా ముండా స్ఫూర్తితో గిరిజన హక్కుల సాధనకు పోరాడాలి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
15 Nov, 2026 - 06:53 PM
17 వీక్షణలు

గిరిజనుల ఆత్మగౌరవం, జల్‌–జంగిల్‌–జమీన్‌ హక్కుల పరిరక్షణకు ఉద్యమించాలి

గూగులోతు కిషన్ నాయక్, గుగ్గిళ్ల పీరయ్య మాదిగ

మహబూబాబాద్, నవంబర్ 15 / ఎన్ టుడే న్యూస్:

గిరిజన హక్కుల సాధన, ఆదివాసుల ఆత్మగౌరవ పరిరక్షణ కోసం భగవాన్ బిర్సా ముండా చూపిన పోరాట మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని తెలంగాణ గిరిజన సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గూగులోతు కిషన్ నాయక్ పిలుపునిచ్చారు. గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలు సమర్థవంతంగా అమలయ్యేలా రాజీలేని పోరాటాలు నిర్వహించాలని అన్నారు.

ఆదివారం మహబూబాబాద్ పట్టణంలోని మంద కొమురమ్మ కాలనీలో దళిత, గిరిజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆదివాసుల పోరాట స్ఫూర్తి ప్రదాత భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, గిరిజన హక్కుల సాధన కోసం బిర్సా ముండా చేసిన పోరాటాలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కిషన్ నాయక్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా బిర్సా ముండా ఆదివాసుల హక్కుల కోసం ఉద్యమించారని గుర్తుచేశారు. ముఖ్యంగా జల్‌–జంగిల్‌–జమీన్‌ నినాదంతో భూమి, అడవి, ప్రకృతి వనరులపై ఆదివాసులకు సంపూర్ణ హక్కులు ఉండాలని పోరాటం సాగించారని తెలిపారు. గెరిల్లా పోరాట పద్ధతుల ద్వారా బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చేసి గిరిజనుల్లో చైతన్యం నింపారని పేర్కొన్నారు.

సంతాల్ విప్లవం, చువార్ తిరుగుబాటు, కోల్ తిరుగుబాటు వంటి ఉద్యమాల స్ఫూర్తితో బిర్సా ముండా గిరిజన జాతి విముక్తి, స్వేచ్ఛ, ఆత్మగౌరవం కోసం అంకితభావంతో పోరాడారని వివరించారు. పేదరికం, అజ్ఞానం, బానిసత్వం, అణచివేతలో ఉన్న అడవి బిడ్డల విముక్తి లక్ష్యంగా జార్ఖండ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల్లో గిరిజన హక్కుల ఉద్యమాలకు నాయకత్వం వహించారని గుర్తుచేశారు.

బిర్సా ముండా పోరాట స్ఫూర్తి నేటికీ దేశవ్యాప్తంగా గిరిజన సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తోందని కిషన్ నాయక్ అన్నారు. ఆయనను భగవాన్ బిర్సా ముండాగా ప్రజలు గౌరవంగా స్మరించుకుంటున్నారని తెలిపారు. పార్లమెంట్‌లో ఆయన చిత్రపటానికి జయంతి సందర్భంగా అధికారికంగా నివాళులర్పించడం, ఆయన పేరుతో విమానాశ్రయాలు, ఇతర నిర్మాణాలు చేపట్టడం గిరిజన పోరాట చరిత్రకు లభిస్తున్న గుర్తింపుగా పేర్కొన్నారు.

బిర్సా ముండా ఆశయాలను కేవలం జయంతి వేడుకలకే పరిమితం చేయకుండా, ఆయన పోరాడిన హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. గిరిజనులకు సంబంధించిన చట్టాలు సమర్థవంతంగా అమలయ్యేలా, వారి భూములు, అటవీ హక్కులు, ఆత్మగౌరవం కాపాడేలా సామాజిక సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు గుగ్గిళ్ల పీరయ్య మాదిగ, మహాజన మహిళా మండలి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు ఎండీ రజియా పాల్గొన్నారు. అలాగే ఇందిరానగర్ సర్పంచ్ ఎండీ షరీఫ్, సర్వపురం సర్పంచ్ లకావత్ బాలాజీ, బయ్యారం చర్లపల్లి సర్పంచ్ బాలకృష్ణ, రంగాపురం ఎంపీటీసీ భూక్య లింగ్యా, మాన్సింగ్, ఎమ్మార్పీఎస్ మహబూబాబాద్ మండల ఇన్‌చార్జి ఈదురు సైదులు మాదిగ, మాలోతు చంద్రశేఖర్, మాలోతు శారద, జ్యోతి సోనీ తదితరులు పాల్గొన్నారు.