BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 07 February 2026, 09:10 am
Posted by : NTODAY NEWS OFFICIAL

రాయికల్‌పై గులాబీ జెండా ఎగురవేస్తాం

తెలంగాణ
07 Feb, 2026 - 09:10 AM
286 వీక్షణలు
రాయికల్‌పై గులాబీ జెండా ఎగురవేస్తాం మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయం: దావ వసంత సురేష్ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ రాయికల్ పట్టణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులు ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నాయి. ఇందులో భాగంగా జిల్లా తొలి జడ్పీ ఛైర్‌పర్సన్ దావ వసంత సురేష్ శుక్రవారం రాయికల్ పట్టణంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. 1, 5, 10, 11, 12వ వార్డుల పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థులు కైరం రమణ, వల్లకొండ సంధ్య, పెండాల వనిత, మారంపల్లి సాయి కుమార్, సిర్ప సంతోష్‌లకు ఆమె మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి రెండేళ్లు పూర్తయినా రాయికల్ పట్టణంలో ఒక్క అభివృద్ధి పనికీ శ్రీకారం చుట్టలేదని విమర్శించారు. పట్టణంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి అంతా కేసీఆర్ పాలనలోనే సాధ్యమైందని పేర్కొన్నారు. మళ్లీ కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ప్రజలు మోసపోయే ప్రమాదం ఉందని, కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రాయికల్ పట్టణంపై తప్పకుండా గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలిగేటి అనిల్ కుమార్, కైరం కట్కం రవి, శ్రీధర్ రెడ్డి, బర్కాం మల్లేష్, మహేశ్వర్ రావు, సాయి కుమార్, మహేష్ గౌడ్, చిట్ల రమణ, రాజేందర్ గౌడ్, ప్రశాంత్ రావు, చాంద్ పాషా, శ్రీను, లక్ష్మణ్, రాంప్రసాద్, వెంకటేష్, వేణు తదితరులు పాల్గొన్నారు. #Raikal #BRS #MunicipalElections #PinkFlag #GrassrootsCampaign #TelanganaPolitics #VoteForCar #UrbanDevelopment Follow us on Website Facebook Instagram YouTube