BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 25 September 2026, 12:23 pm
Posted by : ADARI RAMA PRASAD

పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
ADARI RAMA PRASAD Munagapaka Mandal Reporter
25 Sep, 2026 - 12:23 PM
83 వీక్షణలు

యలమంచిలి, సెప్టెంబర్ 24: పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

యలమంచిలి మున్సిపల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే 172 మంది లబ్ధిదారులకు గృహ నిర్మాణ ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం రూ.49 కోట్ల నిధులు మంజూరు చేసిందని విజయ్ కుమార్ తెలిపారు. ఈ నిధులతో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు చెప్పారు.

రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, శారదా నది ప్రక్షాళన తదితర పనులను వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు.

తనపై విశ్వాసం ఉంచి 50 వేల భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని విజయ్ కుమార్ తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం, సహకారం అవసరమన్నారు.

కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.