BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 01 January 2026, 07:06 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

అన్ని సౌకర్యాలు కల్పిస్తాం

తెలంగాణ
01 Jan, 2026 - 07:06 PM
208 వీక్షణలు

చిన్నకాపర్తి పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం

NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్, మండల విద్యాధికారి సైదా నాయక్‌తో కలిసి తాము చదువుకున్న పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆవుల సుందర్ మాట్లాడుతూ, తాము చదువుకున్న పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతామని, పాఠశాల అభివృద్ధికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. గ్రామంలోని పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద ఎంపికైందని, ఆ పథకం ద్వారా వచ్చే నిధులతో విద్యార్థులకు లైబ్రరీ సౌకర్యాన్ని కల్పించి, అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచే విధంగా త్వరలో చర్యలు చేపడతామని అన్నారు. అలాగే విద్యార్థుల కోసం సైన్స్ ప్రయోగాలకు ప్రత్యేక సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పాఠశాల భవనంలోని సీలింగ్‌ను త్వరలోనే మరమ్మతులు చేయించి, పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని అదే పాఠశాలకు సర్పంచ్‌గా వచ్చిన ఆవుల సుందర్‌ను, ఉప సర్పంచ్ బెల్లంకొండ లావణ్య రఘును, మండల విద్యాధికారి సైదా నాయక్‌తో పాటు ఉపాధ్యాయులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ ఆవుల మాధవి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube