BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 04:20 pm
Posted by : K MAHESH

వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
17 Nov, 2026 - 04:20 PM
24 వీక్షణలు

భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటా: ఎంపీ పోరిక బలరాం నాయక్

మహబూబాబాద్ జిల్లా | కురవి | నవంబర్ 17 (ఎన్ టుడే న్యూస్):

కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా భక్తుల విశ్వాసాన్ని పొందిన కురవి శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయాన్ని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయానికి చేరుకున్న ఎంపీకి ఆలయ అర్చకులు, చైర్మన్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఎంపీ పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ.. వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. నిత్యం వేలాది మంది భక్తులు ఆలయానికి వస్తున్నప్పటికీ వారికి అవసరమైన సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవని పేర్కొన్నారు. భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కోర్ని రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల ప్రధాన కార్యదర్శి ఆవిర మోహన్ రావు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.