BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన పెద్దిరెడ్డి కుటుంబం thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన పెద్దిరెడ్డి కుటుంబం thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ
Date of Publish : 12 February 2026, 09:20 am
Posted by : NTODAY NEWS OFFICIAL

లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా తునిలో కార్మికుల సమ్మె

తెలంగాణ
12 Feb, 2026 - 09:20 AM
199 వీక్షణలు
లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా తునిలో కార్మికుల సమ్మె NTODAY NEWS: తుని మండల ప్రతినిధి ప్రవీణ్  కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె పిలుపు మేరకు తునిలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచే బస్సులను అడ్డుకొని నిరసన తెలిపారు. అనంతరం ఎమ్మార్వో కార్యాలయం నుంచి బాలాజీ కాంప్లెక్స్ మీదుగా గొల్ల అప్పారావు సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత ధరలకు అనుగుణంగా కార్మికులందరికీ కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విశాఖ ఉక్కు సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని కోరారు. ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని, పని గంటల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేసి వేతనాలు పెంచాలని, హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని, ఉచిత బస్సు కారణంగా నష్టపోయిన డ్రైవర్లకు పరిహారం చెల్లించాలని కోరారు. అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్న సంక్షేమ పథకాలను అమలు చేయాలని తెలిపారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర చట్టబద్ధం చేయాలని, ఉపాధి హామీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెకు యూటీఎఫ్ సంఘీభావం ప్రకటించింది. కార్యక్రమంలో అంగన్వాడీ, ఆశ, మిడ్‌డే మీల్స్, మున్సిపల్, పంచాయతీ, ట్రాన్స్‌పోర్ట్, భవన నిర్మాణ కార్మికులు మరియు సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. #Tuni #LabourStrike #CITU #MinimumWage #LabourCodes #WorkersRights #AndhraPradeshNews Follow us on Website Facebook Instagram YouTube