BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 26 June 2026, 06:22 am
Posted by : రావిపాటి ప్రభాకరావు

యద్దనపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్యాచార కేసును ఛేదించిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
26 Jun, 2026 - 06:22 AM
253 వీక్షణలు

బాపట్ల జిల్లా | N Today News

యద్దనపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మహిళపై లైంగిక దాడి కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించి వివరాలను బాపట్ల డీఎస్పీ సి.హెచ్. చంద్రమౌళి వెల్లడించారు.

పోలీసుల కథనం ప్రకారం, ఒడిశా రాష్ట్రానికి చెందిన 36 ఏళ్ల మహిళ జీవనోపాధి కోసం తన భర్తతో కలిసి పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో నివసిస్తూ కూలి పనులు చేస్తోంది. ఈ నెల 15న చిలకలూరిపేటలో కూలి పనుల కోసం వేచి ఉండగా, పని ఇప్పిస్తానని నమ్మించి ఓ యువకుడు ఆమెను మోటార్ సైకిల్‌పై తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

మార్గమధ్యంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మహిళపై లైంగిక దాడికి పాల్పడిన అనంతరం, ఆమె సెల్‌ఫోన్‌ను తీసుకుని నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు విచారణలో వెల్లడైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు యద్దనపూడి పోలీసులు సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, డీఎస్పీ చంద్రమౌళి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో మార్టూరు సీఐ బి. నాగభూషణం నేతృత్వంలోని పోలీసులు పర్చూరు సమీపంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల ప్రకారం, అరెస్ట్ అయిన నిందితుడు కుంభా వెంకట్ (19) వద్ద నుంచి బాధితురాలి సెల్‌ఫోన్‌తో పాటు నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరిచారు.

ప్రాథమిక విచారణలో నిందితుడిపై గతంలో దొంగతనం కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఈ కేసులో ఉపయోగించిన మోటార్ సైకిల్ కూడా దొంగిలించబడినదేనని దర్యాప్తులో తేలినట్లు వెల్లడించారు.

ఈ కేసును వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసిన డీఎస్పీ సి.హెచ్. చంద్రమౌళి, మార్టూరు సీఐ బి. నాగభూషణం, యద్దనపూడి ఎస్‌ఐ డి. రత్నకుమారి మరియు పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు